రాగం - మాయామళవగౌళ- ఆదితాళం
దొంగయుండేటి
దారి తెలియక దోషబద్ధుడై చిక్కేవూ బోధననమ్మీ సాధనజేసితె బాధలు లేక తిరిగేవూ "ప"
అంగవిచారంలింగము
తెలిసితె సంగములయ్యేదెరిగేవు సాధుసజ్జనులసేవజేసితె సారము కనుగొని తెలిసేవూ "దొంగ"
విశ్వ చరాచర
విరాటరూపం ఇంటికిలోపల తెలిసేవూ అంటీ అంటక జంటజేరుకొని వంటిగానితో వదిలేవూ "దొంగ"
ఇంటివివరమది
కంటికి నడుమున కానక మదిలో తిరిగేవూ కాంతిరూపమై కంటికీ ఎదుటగ కానక మదిలో మరచేవూ "దొంగ"
గురు భం భం కరుణ
గల్గితె గోప్యము మదిలోయుంచేవూ సర్వదాసులకు సేవకుడైనా శేఖుస్సేనని తెలిసేవూ "దొంగ"
No comments:
Post a Comment