Sunday, September 13, 2015

రాగం - నాదనామక్రియ - ఆటతాళం
ఓ న మః లు చదివేరుగానీ అనని పల్కందేమిరా అనని పల్కందేమిరా అది అందిపొందందేమిరా                        "ఓ న మః లు"
ఓ న మః లు చదివేరుగాని ఆనవాలు తెలిపించరా "ఓ న మః లు"  శి వ యః పదవిలో బహుసిద్ధముగ సాధించరా    "ప"
అ ఆ ఇ ఈ వివరముల గురు ఆదిమూలము తెలియరా                                                                  "ఓ న మః లు"
ఉ ఊ ఋ ౠ లు లూ లోపుల లోభమైయున్నాద్దిరా  అం అః పదవి ఆదిగురు ఆర్యులకు అగుపడునురా             "ఓ న మః లు"
క ఖ గ ఘ యనుచు మదిలో కదలమెదలందేమిరా కదలమెదలందేమిరా "ఓ న మః లు" దాన్ని కౌగిలించి చూడరా "ఓ న మః లు"
చ చ జ ఝ యనుచు మదిలో చరచరంబులు తెలియరా ట ఠ డ ఢ యనుచుదాని తాత్పర్యంబు తెలియరా            "ఓ న మః లు"
త థ ద ధ యనుచుమదిలో తరచిమదిలొ చూడర ప ఫ బ భ యనుచు దాని పరిమళమేమందురా                             "ఓ న మః లు"
య ర ల వ ను మదిలొ దలచితె యెరుకనూమర్వాకురా శ ష స హ యనామూర్తులకు అది సేవ దొరకందేమిరా      "ఓ న మః లు"
ళ క్ష మీద గురు లక్ష్య బెట్టితె నాణ్యమది గనిపించురా గురు భం భం కరుణచేత గోప్యమదిగని చూడరా                           "ఓ న మః లు"
రవతిభావం తెలియుట బహురహస్యముగ యున్నాదిర రాపు జేసీ గురుని దగ్గెర రహస్యమదిగనిచూడరా              "ఓ న మః లు"

వాసిగా ఉరగాద్రిప్యాటలో దాసుడైయున్నడురా దాసులకు తద్దాసుడైన హుస్సేన్ దాసుని తెలియరా                     "ఓ న మః లు"

No comments:

Post a Comment