రాగం -ఉమాభరణం - ఆటతాళం
దాసుడే అమ్మా
దాసుడే హరి భక్తులాకు దాసుడే అమ్మా దాసుడే "ప"
దాసునిజూడారె
మీరు దోషములు బాసీనవారై దాపు జేరి గురుని దగ్గెర దోషరహితుదు అయిన వానీ దాసుడే "దాసుడే
"
జాతి నీతి లేనివాడు
జన్మ పావనమైనవాడె జ్యొతిభావము దెలిసినోని జాతిలోగలిశున్న వాని "దాసుడే "
అండములొ అణగీనవాడె
పిండములొ ప్రబలీనవాడె గండిదాటి వెళ్ళినాడు ఘనతదాసులచేరినోని "దాసుడే "
కులముగోత్రములేనివాడు
కూడి సాధులొచేరినాడె కుదుటనిలిపి మనసుయుంచితె కుండలిలొకలిసేటివాని "దాసుడే
"
చిప్పగిరిలోనవొప్పియున్నడు
చిన్మయాకారూడు వాడె భయలు భావము దెల్పినోని భంభంబూగురుస్వామి భక్తుని "దాసుడే "
ధరణిలో ఉరగాద్రి పురమున దాసుడై తిరిగేటి వాడె సేవజేసిమదిలొయుంచిన
శేఖుస్సేందాస్ వాని దాసుడే "దాసుడే "
No comments:
Post a Comment