Friday, September 4, 2015

హజరత్ భం భం హుస్సేన్ దాస్ రహమతుల్లాహ్ అలైహ్ కీ హిదాయత్ తత్వములు

హజరత్ భం భం హుస్సేన్ దాస్ రహమతుల్లాహ్ అలైహ్ కీ హిదాయత్         
        తత్వములు                     
రాగం - పీలు - ఆటతాళం
బోలోరే బిసమిల్లాహ్ లోకమెల్ల కల్మా రసూలిల్లహ్ కాంతీరూపమెల్లా               "ప"
ఇంటిలోతెలియవల్లా వివరామెల్ల వివరించి చూడవల్ల ఇల్లిల్లాహ్ లోపులల్లా        "బోలోరే"
భావము తెలియవల్ల భావమెల్ల భాగించిచూడవల్ల బయలూ లోపూలల్లా           "బోలోరే"
మూలము తెలియవల్లా ముఖ్యామెల మహనీనుజేరవల్ల ముహమ్మదు కృపవల్ల "బోలోరే"
సేవించీ తలువవల్ల సేవవల్ల శేఖరుడు గావల్ల శేఖూసేనువల్ల                        "బోలోరే"


రాగం - మాయామళవగౌళ- ఆటతాళం
అల్లాహ్ స్మరణ చేయవలెరా వట్టికోల్లపాపములన్ని తొలగిపోవునురా     "ప"
చిల్లరగుణములిడువవలెరా వాని చిన్మయకారుని చెంత జేరవలెరా       "అల్లాహ్"
జాతిభేదములిడువలలెరా  తన జన్మ రహితమయ్యె జాడగనవలెరా      "అల్లాహ్"
తనలో తానేజూడవలెరా తాను తానయ్యె వస్తువును  తాగావలెరా        "అల్లాహ్"
బ్రహ్మామహేష్వరుని గనరా వట్టికలి మాయలోజిక్కి కష్టింపదగదురా       "అల్లాహ్"
దశ అవతారాలు ఎత్తెగదురా విష్ణు  కర్మాబద్ధుడయ్యి కడతేరెగదుర        "అల్లాహ్"
ముహమ్మదు మహిమా గానవలేరా బోధా సాధించి జూచి సద్గురునిగనవలెరా "అల్లాహ్"
సేవించిమదినిల్పా వలెరా ఆ శెఖుస్సేన్ మదిలోనె శ్రద్ధుంచరా             "అల్లాహ్"      

రాగం - నాదనామక్రియ - ఆటతాళం
లాయిలాహనెకల్మ జదువుతు తనువులయము జేసితే నీవు ఇల్లిల్లాహ్ లో గనెవు        "ప"
పంచతత్వమెనగటనవూ  ఆ పాంచకల్మలోనె ప్రభువునిగనేవు                                "లా ఇలా"
సవ్రబ్రహ్మమె ఒకటనేవు ఆ సాక్షీగ మదిలోనే శంభూని గనేవూ                               "లా ఇలా"
మూలభేదం ఒకటనేవు ఆ మాధవే మొహమ్మదు మనగొగటి అనేవు                        "లా ఇలా"
వాని భాగించి చూచితె భం భమ్నే గనేవు                                                        "లా ఇలా"
ధరణిలోపురగాద్రిగనేవు సర్వదాసుల సేవకుని శేఖుస్సేన్నే గనేవు                            "లా ఇలా"




రాగం - ఆనంద భైరవి - ఆటతాళం
మూల భావం తెలియకుంటే ముందు ముక్తి లేదుర మహిమ తెలిపే ముహమ్మదును మదిలొ నమ్మి యుండరా                                                                                                                        "ప"
విత్తు ఒక్కటి శాఖలెన్నో వివరమూ తెలిశుండరా శాఖయంతను లోక మాయను లేని వస్తువ దెల్పరా   "మూల"
ఏక చిత్తగ మనసు ల్యాక యధవలై చదివేరురా చదువు లోపల లేని చదువది సాధనము జేశుండరా   "మూల"
జనన మరణం జాడ దెలిసితె జాతి భేదం లేదురా జాతి లోపల జ్యోతి యున్నది గ్నాతివైతె దెల్పరా      "మూల"
ఒక్కదానివైపు దెలిసితె వదలకామదినిల్పరా వైపు దెలిసిన గురుని దగ్గర వదిగి సేవ జేయరా            "మూల"
సేవజేసితె ఫలము నీకు శీఘ్రముగ అయ్యుండుర శేఖుసేనును మదిలొదలచితె చలనము ల్యాకుండుర "మూల"


రాగం - నవరోజ్ - ఆదితాళం
అలీఫ్ వివరము అంతుతెలిసితె కితాబు చదవటమ్యాలనయ ఆలోయుండే భేదం తెలిసితె వేదం చదవటమ్యాలనయా        "ప"
ఓ అనే అక్షరవైనము దెలిసితె వదరడములు ఇంగ్యాలనయా బే అనె అక్షర భేదం దెలిసితె వాదభేదములు యాలనయా    "అలీఫ్"
రెంటి వివరమది వంటుదెలిసితె వద్దనెయున్నది చూడరయా అంటి అంటకను జంట జేరుకొని వంటిగయున్నది తెలియరయా              "అలీఫ్"
ఏడు ప్రకాశలు ఆకారమున యెతికి బాగ మీరు చూడరయా పాక్ ముహమ్మదు ప్రార్థన జేసితె ప్రభువని నమ్మితెలియరయా     "అలీఫ్"
హెచ్చుకులమనే యధవలు పలికే వేదము ఏదది దెల్పరయా జనన మరణమది జాడ ఒక్కటె జాతిఏదొ మాకు దెల్పరయా      "అలీఫ్"
ముట్టు అంటుతో మునిగిన కులమది ముందు ఏర్పాటేదిరయా అంటి-అంటక పుట్టిన కులమేదొ ఆర్యులైతె మాకు దెల్పరయా                                                                                                "అలీఫ్"
సర్వలకొక్కడు సాక్షిభూతుడై సాయమైనది తెలియరయా సాధుసజ్జనుల సేవ జేసితె సారముగనుగొని తెలియరయా   "అలీఫ్"
గురు భం భం కరుణకలిగితె గోప్యము మదిలో యుంచరయా సర్వదాసులకు సేవకుడైన శేఖుసేనుని తెలియరయా                                        "అలీఫ్"


రాగం -ఉమాభరణం - ఆదితాళం
అవ్వల్ కల్మా ఆదివేదమది అంతరంగమున బిస్మిల్లా దువ్వం కల్మా ఆత్మ భేదమది దుర్లభం దొరికేది ఆయల్లా         "ప"
తీనంకల్మా తిరకూటి అది తీర్థ ప్రసాదం బిసమిల్లా మూలభవమున ముందు తెలిసితె మోక్షమిచ్చునది బిస్మిల్లా         "అవ్వల్ కల్మా"
చహరం కల్మా చతురవేదమది శాస్త్రమూలమై బిస్మిల్లా పంచతత్వమిది పాంచకల్మతో ప్రణవమైనదిర బిస్మిల్లా          "అవ్వల్ కల్మా"
భేదములిడిచి నాదము దెలిసితె నాణ్యమైనదిర బిసమిల్లా నాదబ్రహ్మమిది నాణ్యము తెలిసితె  నాదరహితమై బిస్మిల్లా   "అవ్వల్ కల్మా"
తారకయోగం తరచిజూచితె తనలోయున్నది బిస్మిల్లా తాను తానయ్యేతత్వము తెలిసితె తానై యున్నది బిస్మిల్లా    "అవ్వల్ కల్మా"
సప్తాక్షీ మంత్రంబు పఠనతొ ఆనందమైనది బిస్మిల్లా ఇరవై అయిదు తత్వములోపల ఇలహమైనదిర బిస్మిల్లా           "అవ్వల్ కల్మా"
వేదశాస్త్రములు వెదికిచూచిన ఏకమైనదిర బిస్మిల్లా నిలకు తెలిసితె నీలో చూచితె నిండి యున్నదిర బిస్మిల్లా        "అవ్వల్ కల్మా"
సప్త యోగులకు సాక్షి రూపమై సాయమైనదిర బిస్మిల్లా పాటిగ మదిలో ప్రయోగించితె పరబ్రహ్మముర బిస్మిల్లా        "అవ్వల్ కల్మా"

గురు భం భం కరుణ కలిగితె అనంతరూపము బిస్మిల్లా  సేవ జేసెటి శేఖుసేనుకు శేఖరమైనది బిస్మిల్లా                     "అవ్వల్ కల్మా"



 రాగం - నాద నామ క్రియ - ఆటతాళం
దినా దీనం దినా దీనం దినా బోలొరె దిల్మే ధ్యాన కర్కో దీనా కహోరే                  "ప"
 ఖుదా భగత్ కా భజన కరోరె కూడి మనసునిల్పి ఖుదా కహోరె                       "దిన"
ఆత్మాసంధ్యాకర్కో ఆనంద్ రహోరె ఆధారి పురి మిల్కో అల్లా కహోరె                   "దిన" 
మనసుమనదలినోడి మహీమ దేఖొరే మన్నవనీనదరే మన్ మే సమోరె             "దిన"       
పీరే ముహమ్మద్ సే బోధా జెందారే బోధా జెందితె మీరు భోగ్యులయ్యేరే              "దిన"                            
పేరూ ఉరవకొండ పేటాలోనురే చీడీ తెలిసిన హుస్సెన్ సూక్ష్మామెరుగారే              "దిన" 

                                            రాగం -ఉమాభరణం - ఆటతాళం
దాసుడే అమ్మా దాసుడే హరి భక్తులాకు దాసుడే అమ్మా దాసుడే                       "ప"
దాసునిజూడారె మీరు దోషములు బాసీనవారై దాపు జేరి గురుని దగ్గెర దోషరహితుదు అయిన వానీ దాసుడే                                                                                                                      "దాసుడే "
జాతి నీతి లేనివాడు జన్మ పావనమైనవాడె జ్యొతిభావము దెలిసినోని జాతిలోగలిశున్న వాని      "దాసుడే "
అండములొ అణగీనవాడె పిండములొ ప్రబలీనవాడె గండిదాటి వెళ్ళినాడు ఘనతదాసులచేరినోని  "దాసుడే "
కులముగోత్రములేనివాడు కూడి సాధులొచేరినాడె కుదుటనిలిపి మనసుయుంచితె కుండలిలొకలిసేటివాని                                                                                                                         "దాసుడే "
చిప్పగిరిలోనవొప్పియున్నడు చిన్మయాకారూడు వాడె భయలు భావము దెల్పినోని భంభంబూగురుస్వామి భక్తుని                                                                                                                "దాసుడే "
ధరణిలో ఉరగాద్రి పురమున దాసుడై తిరిగేటి వాడె సేవజేసిమదిలొయుంచిన శేఖుస్సేందాస్ వాని దాసుడే                                                                                                                           "దాసుడే "

No comments:

Post a Comment