
రాగం - మాయామళవగౌళ- ఆటతాళం
ఏడు కోట్ల భూమండలంబులు
/ ఏకమయ్యి తరచరే ఏక స్థానము అల్లా యున్నడు యెతికి బాగా జూడొరే //పల్లవి//
ఆరుమతములు ఒకటిజేసి
ఆది అంత్యముగానరే / ఆది అంత్యముదెలసియుంటె అల్లా యున్నడు చూడొరే //
ఏడు కోట్ల //
కన్నుమిన్ను
రొంటినడుమున కలసిజ్యోతిని చూడరే / కలసి జ్యోతిని జూచియుంటె / ఖర్మములు ఇగలేవ్వొరె // ఏడు కోట్ల //
బయలు లోపుల బయలు
తెలిసితె బట్టబయలది జూడొరే ? నట్టనడమొక నాణ్యమున్నది నయముతోగని జూడొరే // ఏడు కోట్ల //
గురుతులేక తిరిగి
మీరు గొర్రెలై చెడిపోదురే / గుట్టుమార్గము తెలిసియుంటె గుణమునిలిపి జూడొరే // ఏడు కోట్ల //
కానిపోని మాటలాడితె
కలహము మనక్యాలొరె / కలసి దేవుని కొలిచియుంటె ఖర్మములు తెగిపోనొరె // ఏడు కోట్ల //
గురుమహమ్మదు
కరుణ గల్గితె గుర్తునిలపీజూడరె / గోప్యమైనా ఆది పదవని గొప్పగా మదినుంచొరే // ఏడు కోట్ల //
పేరువురవకొండలోపల
ప్యాటలోయున్నడొరే / పెద్దలా సేవకుజెందిన షఖుస్సేన్
ను గానొరే // ఏడు కోట్ల //
No comments:
Post a Comment