Friday, December 25, 2015

రాగం - ఆనందభైరవి – ఝంపెతాళం
ఆనందయోగికావలెరా ఆదిగురిలొంచె గురిజూచి గుర్తించవలెర                                         "పల్లవి"
మాటతెలియని మాయ యోగమెందుకురా బ్రహ్మ రంధ్ర జ్ఞాన పరుడె గురుడనరా గ్రంధశోధకుకవులు ఘనులు
కాదనర హరిగురునివరకవులు అధికులనవలెరా                                                  "ఆనందయోగి" 
జలము చలమినయట్లు వూరుచున్నదిరా ఆరీతి హరి భజన నోరూరవలెర; ఘననితో యిట్లా ఘనతచాయకురా యెళ్ళివచ్చిన వాక్కు వేదామృతము గానలెరా                                                    "ఆనందయోగి"
భగవతాజనుల సంభాషించవలెరా చెడ్డగురువుల బోధచేటుదప్పదురా; కడతేర్చెగురుడొక్క కాసు అడగడురా; ఆశలుడిగిన గురుడె అతడె దైవమురా                                                             "ఆనందయోగి"
పద్మాసనం వేయవలెరా నిండుపూర్ణసామాధీగ నెగడించవలెరా చూపు అంతర్లక్షమందు నిల్పలెర కనూపాపలందేగురుని కళలుంచవలెర                                                             "ఆనందయోగి"
నిక్కి చక్కగయక్కవలెరా; యెక్కి ఐదుపురములుజొచ్చి అటువెళ్ళవలెర హంసమార్గము తెలియవలెర; తెలిసినడినాళమునదూరి నడచిపోవలెర                                                           "ఆనందయోగి"
పావనయోగము పట్టవలెర; పట్టి ఫణివతినికదలించి  పైకెత్త వలెరా ఆధారపురిచేరవలెర; చేరి  భయపడక ఆమీదభయములుగనవలెర                                                                        "ఆనందయోగి"
గిరియున్నతముజూడవలెరా; చూచిజరతిలోపడకుండ జరిగిపోవలెరా పండువెన్నెల యెలుగు ప్రబలుచున్నదిరా
యందుజూచినయెలుగు నిండియున్నదిరా యెలుగులో  అపరంజినగురుచొరవలెర నగెరిమూలనవొక్క  జగిలియున్నదీరా అచ్చటా హరిహర సేవించవలెర  గురుమహమ్మదుచాతగుర్తుగనవలెర     "ఆనందయోగి"

No comments:

Post a Comment